Write Up

తెలుగు కవిత

పలక నేర్పిన పాఠం

చెరిపి  చెరిపి చెరిపి
రాసి రాసి రాసి
పలక మీద తెల్ల  బలపం
సరిగా బొమ్మ  గీయందే  !
అలసి అలసి  పోయిన
చిట్టి చేతులు  బంక  పట్టి
మట్టి కొట్టి  చిక్కు  పడిన
నొసలు రంగు బుగ్గలు  !
పట్టు వీడని  పాప
మళ్ళీ మళ్ళీ గీస్తూ,చేత్తో
తుడుస్తూ,మళ్ళీ గీస్తూ
మనసంతా నవ్వు పులుముకుంది
చూస్తూ చూస్తూ చూస్తూ
మళ్ళీమళ్ళీ గుర్తొచ్చింది
ప్రేమ దాచలేను మన్నించలేను
మరచిపోలేను.కనికరించలేను
 కరుణను   కాదన  లేను.
చినుకు చినుకు వాన
తుఫానుగా తెర్లారింది
నలిపి నలిపి  నాసిక
నెత్తురోడింది. నెమ్మది
కరువైన  సమయాన
చెరిపేస్తే  ,తుడిచేస్తే
కడిగేస్తే ;పెంచుకొంటే
పెరిగే ప్రేమ ,తుంచుకొంటే
మురిగే ప్రేమ. నీ నా అనుబంధం
మమతలుమనసులోనే
 మధురమైన మురిపెం మదిలోనే.  మరచిన ప్రేమ మళ్ళా  ముంచుకొచ్చింది .
 చిలికి చిలికి చిలికి తీసిన  వెన్నపూసలా పక్కున  నవ్వింది పాప ఫలించిన శ్ర మలో పరవశించింది  పన్నీరు వొలికింది
సర్దుబాటు  సమస్య  పూరించింది.ఓర్పు  వగలు  బోయింది.మనసు అరవిచ్చింది   ప్రేమ తొంగి  చూచింది
తెల్లగా తెల్లారింది  నలుపు
తెలుపయింది.నీ, నా కలయిక
మూడు పువ్వులు  ఆరు
కాయలయ్యింది. పలక మీద
బొమ్మ పగలబడి  నవ్వింది
———- Forwarded message ———
From: Leelavathi <imlydiaa@gmail.com>
Date: Fri, 24 Aug 2018, 7:59 a.m.
Subject: పలక పద్యం
To: Leelavathi Malaka <imlydiaa@gmail.com>
చెరిపి  చెరిపి చెరిపి
రాసి రాసి రాసి
పలక మీద తెల్ల  బలపం
సరిగా బొమ్మ  గీయందే  !
అలసి అలసి  పోయిన
చిట్టి చేతులు  బంక  పట్టి
మట్టి కొట్టి  చిక్కు  పడిన
నొసలు రంగు బుగ్గలు  !
పట్టు వీడని  పాప
మళ్ళీ మళ్ళీ గీస్తూ,చేత్తో
తుడుస్తూ,మళ్ళీ గీస్తూ
మనసంతా నవ్వు పులుముకుంది
చూస్తూ చూస్తూ చూస్తూ
మళ్ళీమళ్ళీ గుర్తొచ్చింది
ప్రేమ దాచలేను మన్నించలేను
మరచిపోలేను.కనికరించలేను
 కరుణను   కాదన  లేను.
చినుకు చినుకు వాన
తుఫానుగా తెర్లారింది
నలిపి నలిపి  నాసిక
నెత్తురోడింది. నెమ్మది
కరువైన  సమయాన
చెరిపేస్తే  ,తుడిచేస్తే
కడిగేస్తే ;పెంచుకొంటే
పెరిగే ప్రేమ ,తుంచుకొంటే
మురిగే ప్రేమ. నీ నా అనుబంధం
మమతలుమనసులోనే
 మధురమైన మురిపెం మదిలోనే.  మరచిన ప్రేమ మళ్ళా  ముంచుకొచ్చింది .
 చిలికి చిలికి చిలికి తీసిన  వెన్నపూసలా పక్కున  నవ్వింది పాప ఫలించిన శ్ర మలో పరవశించింది  పన్నీరు వొలికింది
సర్దుబాటు  సమస్య  పూరించింది.ఓర్పు  వగలు  బోయింది.మనసు అరవిచ్చింది   ప్రేమ తొంగి  చూచింది
తెల్లగా తెల్లారింది  నలుపు
తెలుపయింది.నీ, నా కలయిక
మూడు పువ్వులు  ఆరు
కాయలయ్యింది. పలక మీద
బొమ్మ పగలబడి  నవ్వింది
Show More

LeelaMalaka

Hello All! I am a retired Lecturer, Former Air Hostesses, and a writer. I love to share MY STORIES, WITH MY GOD.

Related Articles

Close