Write Up

తెలుగు కవిత

￰భ్రష్టు పట్టిన కులవ్యవస్థ
కుళ్లి పోయిన మానవతా
కండకావరమెక్కిన ధన ధాన్యం , రక్త దాహం తో మదమెక్కిన కుసంస్కారం
కళ్ళుముసుకు పోయిన సమాజం నడి రోడ్డులో పట్టపగలు నెత్తురోడిన కాసాయతనం కన్న కూతురి వైదవ్యత్వం కోరిన క్రూరత్వం
కడుపులో ఉన్న పసికoదు నైనా కనికరించని అటవీకత
చూస్తూకళ్ళు మూసుకున్న మూకలు ఎటుబోతున్నాం ఏమవుతున్నాం ఎక్కడఉంది హృదయ చలనం ??
కన్నీరుఏరులై పారుతుంది ఏమిచెయ్య గలం ఆనాడు ఐషా మరోనాడు నిర్భయ
ఈనాడు కన్నతండ్రే కిరాయి హంతకునితో మాంగల్యం తెంపిన ధౌర్భాగ్యత్వం
నిస్సహాయినై నిట్టూర్పు విడుస్తున్న ఏమిచెయ్యగలను అంటూ దిక్కులు చూస్తున్న తల్లిదండ్రుల కడుపు కోత తీర్చేదెలా ,? బ్రతికించేదెలా బ్రతికించేదెలా? ఎలా?

Show More

LeelaMalaka

Hello All! I am a retired Lecturer, Former Air Hostesses, and a writer. I love to share MY STORIES, WITH MY GOD.

Related Articles

Close